Friday, December 27, 2024

బైక్ దొంగను పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బైక్‌లు చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అభినందించారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సిపి డిఎస్ చౌహాన్‌ను కలిశారు. ఈ నెల 26వ తేదీ 11 గంటలకు ఎస్సై మల్లయ్య, హోంగార్డులు సుదర్శన్, కృష్ణతో ఈసిఐఎల్ ఎక్స్ రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే తాళ్లూరి నుంచి ఈసిఐఎల్‌కు బైక్ వస్తున్న కుషాయిగూడ, సాయినగర్‌కు చెందిన చోటోలు విజయ్ హెల్మెట్ పెట్టుకోకుండా, నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆపారు. వాహనం, యజమాని వివరాలు గురించి ఆరా తీశారు.

బైక్‌పై వచ్చిన యువకుడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అనుమానించిన ఎస్సై మల్లయ్య, విజయ్‌ను పక్కకు తీసుకుని వెళ్లి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. బైక్‌ను టీ జంక్షన్ వద్ద వారం రోజుల క్రితం చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అదుపులోకి తీసుకుని విచారించగా తాను గతంలో 15 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఒప్పుకున్నాడు. ఆటోమొబైల్ దొంగతనాలు, ల్యాప్‌టాప్, గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నట్లు చెప్పాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉన్నట్లు తెలిపాడు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీసర పోలీసులకు అప్పగించారు. దొంగను పట్టుకున్న పోలీసులను రాచకొండ సిపి అభినందించి రివార్డు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News