Thursday, January 23, 2025

తారా సుతారియాతో కుశల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు:విభిన్న శ్రేణి ఫ్యాషన్, వెండి ఆభరణాల ను వేడుక చేసుకునే భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ కుశల్స్, బాలీవుడ్ నటి, ట్రెండ్‌సెట్టర్ అయిన తారా సుతారియాతో భాగస్వామ్యనాన్ని చేసుకున్నట్లు సంతోషంగా వెల్లడించింది. ఈ ఉత్సాహపూరితమైన భాగస్వామ్యం పండుగ సీజన్‌కు తగినట్లుగా రూపుదిదుకున్న ఆకర్షణీయమైన ప్రచారంలో భాగంగా ప్రత్యేకమైన భారతీయ సౌందర్య రూపంలో స్టైల్ ఐకాన్ ను అత్యంత ఆకర్షణీయంగా ప్రదర్శిస్తుంది.

తారా సుతారియా స్వాభావిక అందం, ఆమె ఆధునిక ఫ్యాషన్, సాంప్రదాయ భారతీయ ప్రభావాల యొక్క అప్రయత్న సమ్మేళనంతో, కుశల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ యొక్క సారాంశాన్ని అందంగా ఒడిసిపడుతుంది. అద్భుతమైన పనితనం, నాణ్యతకు పర్యాయపదంగా కుశల్స్ నిలుస్తుంది. యాంటిక్ జ్యువెలరీ కలెక్షన్, జిర్కాన్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, స్టెర్లింగ్ సిల్వర్ కలెక్షన్‌లతో సహా వారి విభిన్నమైన అసాధారణ కలెక్షన్లు ఫ్యాషన్ ప్రియుల కోరికలను తీరుస్తాయి.

కుశల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ నుండి వస్తోన్న పండుగ కలెక్షన్, వేడుకల యొక్క సమిష్టి తత్త్వం లో ప్రతి అంశాన్ని ప్రదర్శిస్తుంది. ఎవరైనా పగటిపూట పూజ చేసినా లేదా సాయంత్రం వేళ దీపావళి పార్టీ చేసినా, పాశ్చాత్య లేదా ఎథ్నిక్ శైలి , ఏదైనా ప్రతి ఒక్కరూ ఎంచుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది. ఈ కలెక్షన్ రాబోయే పండుగలకు, ప్రత్యేకంగా దీపావళికి ఖచ్చితంగా సరిపోతుంది.

ఈ భాగస్వామ్యం పై తారా సుతారియా మాట్లాడుతూ, “కుశల్స్ ఫ్యాషన్ జ్యువెలరీతో భాగస్వామి చేసుకోవటం పట్ల నేను నిజంగా సంతోషిస్తున్నాను. వారి వైవిధ్యమైన కలెక్షన్ చక్కదనం ను ప్రదర్శిస్తుంది. వారి అద్భుతమైన జిర్కాన్ స్టోన్ ఆభరణాలకు నిజమైన నిదర్శనం, ఇది నాకు వ్యక్తిగతంగా ఇష్టమైనది. పండుగల శ్రేణి ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇవ్వడానికి “అవుట్‌షైన్ ది ఫెస్టివిటీస్” (‘ఉత్సవాలలో మరింత ప్రకాశం జోడించడానికి ‘) కి అనువైనది” అని అన్నారు.

కుశల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెటింగ్ డైరెక్టర్ అంకిత్ గులేచా మాట్లాడుతూ.. “కుశల్స్‌లో, మేము మా తాజా పండుగ కలెక్షన్‌ను ఆవిష్కరించినందున, పండుగ ఉత్సాహాన్ని మరింత వేడుక చేసుకోవడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ తారా సుతారియాతో మా భాగస్వామ్యం ఈ కలెక్షన్ లో అంతర్లీనంగా ఉన్న అందం, అధునాతనతను ప్రధానంగా వెల్లడి చేస్తుంది. మా కొత్త పండుగ కలెక్షన్ ను అన్వేషించడానికి మేము ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము, ఈ కలెక్షన్ ఇప్పుడు మీ సమీప కుశల్స్ స్టోర్‌లలో, Kushals.comలో అందుబాటులో ఉంది.

“అవుట్‌షైన్ ది ఫెస్టివిటీస్” క్యాంపెయిన్ పండుగల సీజన్‌లో తమ అంతర్గత సౌందర్యాన్ని ప్రదర్శించడం తప్పనిసరి అనే ఆలోచనను వేడుక చేసుకోవడానికి మహిళలను స్వాగతించింది. వారి సహజమైన మెరుపు, కుశల్స్ సున్నితమైన ఆభరణాలతో మరింత ప్రకాశిస్తుంది , వారి ప్రత్యేకతను వ్యక్తీకరించడంలో, ఉత్సవాల మధ్య నిలబడడంలో కీలక అంశంగా పనిచేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News