Saturday, November 16, 2024

ఎన్‌సిడబ్లూ సభ్యురాలిగా ఖుష్భూ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజకీయవేత్తగా మారిన సినీనటి ఖుష్భూ సుందర్‌కు జాతీయస్థాయిలో కీలక పదవి లభించింది. బిజెపి నేత ఖుష్భూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లూ) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఖుష్భూ ప్రస్తుతం బిజెపి కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. జాతీయ మహిళాహక్కుల సంఘం సభ్యురాలిగా నియమితులైనట్లు ఖుష్భూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు ఆమెకు అభినందనలు తెలిపారు. మహిళా హక్కుల కోసం ఖుష్భూ అలుపెరగని పోరాటానికి గుర్తింపుగా పదవి లభించినట్లు అన్నామలై తెలిపారు.

ఈ సందర్భంగా ఖుష్భూ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మీ నాయకత్వంలో నారీశక్తి పరిరక్షణకు, అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా తొలుత డిఎంకెలో చేరిన ఖుష్భూ చేరారు. ప్రస్తుతం బిజెపి అధికార ప్రతినిధిగా ఖుష్భూ ఉన్నారు. బిజెపిలో చేరిన తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీచేసిన ఖుష్భూ డిఎంకె అభ్యర్థి ఎన్ ఎంజిలన్ చేతిలో ఓటమిపాలయ్యారు. మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ అయినవారిలో ఖుష్భూతోపాటు మమత కుమారి, డెలియానా కొంగుప్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News