Wednesday, January 22, 2025

మీరే నా కుమార్తెను దీవించాలి: ఖుష్బూ

- Advertisement -
- Advertisement -

నిన్నటి తరం హీరోయిన్ ఖుష్బూ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఆమె స్టార్ డైరెక్టర్ సుందర్‌ను 2000లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఖుష్బూ పెద్ద కుమార్తె అవంతిక సినీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఖుష్బూ తెలిపింది. “నా పెద్ద కూతురు అవంతిక ఎన్నో కలలతో లండన్‌లోని బెస్ట్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణను పూర్తి చేసింది. మేము ఆమెను లాంచ్ చేయడం లేదు. సిఫార్సు చేయడం లేదు. మీరే నా కుమార్తెను దీవించాలి”అని ఖుష్బూ సోషల్ మీడియాలో పేర్కొంది.

Kushboo tweet on her elder daughter film entry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News