- Advertisement -
విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయన్లుగా నటిస్తున్న చిత్రం ఖుషి. పాన్ ఇండియాగా రాబోతోన్న ఈ మూవీని డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. షూటింగ్‌ను చకచకా చేస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఇప్పుడు ఓ అప్డేట్ ఇచ్చింది. ఖుషి సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
ఈ మేరకు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాలో శ్రోతలను అలరిస్తున్నాయి. కాగా, సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
- Advertisement -