Thursday, January 23, 2025

విదేశాల్లో కూడా ‘ఖుషి’ పాటల గురించి మాట్లాడుతున్నారు

- Advertisement -
- Advertisement -

‘ఖుషి’ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది – సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ‘ఖుషి’. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్‌ను ఇచ్చిన మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ మీడియాతో మాట్లాడుతూ… ‘దర్శకుడు శివ చెప్పిన కథ విన్నాక ఒక బ్యూటిఫుల్ మూవీకి వర్క్ చేయబోతున్నానని అర్థమైంది.

వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించాను. ‘ఖుషి’ సినిమాకు పనిచేయడం ఒక థ్రిల్లింగ్ అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మొత్తం మ్యూజిక్ పూర్తి అయ్యేవరకు ఎంతో ఆసక్తికరంగా మా ప్రయాణం కొనసాగింది. ‘ఖుషి’ సినిమా కోసం వీణ, సితార్ వంటి సంగీత వాయిద్యాలను వాడాము. ‘నా రోజా నువ్వే’ పాట నుంచి రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘ఓసి పెళ్లామా’ వరకు అన్ని పాటలు బాగా కుదిరాయి. ఈ మూవీలో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మ్యూజిక్ ఉండాలని అనుకున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమాలో కష్టపడి కంపోజ్ చేసిన పాట టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ మొదట సినిమాలో లేదు. టీజర్ కోసం ట్యూన్ చేశాను.

అయితే ఆ ట్యూన్ అందరికీ నచ్చింది. దీన్ని సాంగ్ చేయాలని అడిగారు. అలా ఖుషి టైటిల్ సాంగ్ చేశాను. విదేశాలకు వెళ్లినా కూడా ‘ఖుషి’ పాటల గురించి మాట్లాడుతున్నారు. అదే మాకు పెద్ద అఛీవ్‌మెంట్. శివ మ్యూజిక్ గురించి ప్యాషన్ ఉన్న దర్శకుడు. మ్యూజిక్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారని నేను నమ్ముతాను. ‘ఖుషి’లో సమంత, విజయ్ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వాళ్లు పోటాపోటీగా నటించారు. ఈ సినిమాకు వాళ్ల అద్భుతమైన నటన ఎంతో హైలట్‌గా ఉంటుంది అని అన్నారు.

Also Read: కారుతో డాక్టర్ ను ఢీకొట్టి… బానెట్‌పై 50 మీటర్లు లాక్కెళ్లి (వీడియో వైరల్ )

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News