Wednesday, January 22, 2025

లవ్, సెలబ్రేషన్‌ల ‘ఖుషి’..(ట్రైలర్)

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కలర్‌ఫుల్‌గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న ‘ఖుషి’ విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ “దేశంలోని అనేక అందమైన ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. అర్జున్ రెడ్డి సినిమా చూశాక విజయ్ అంటే విపరీతమైన లవ్ ఏర్పడింది. అదంతా ఈ సినిమాలో చూపించాను.

సమంత నా అభిమాన నటి. ఆమె కథను, క్యారెక్టర్‌ను అర్థం చేసుకునే విధానం నాకు బాగా నచ్చుతుంది. లవ్ అండ్ సెలబ్రేషన్ ఈ రెండు ‘ఖుషి’ సినిమాలో ఉంటాయి”అని అన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “ఇదొక క్యూట్ లవ్ ఫిల్మ్. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు మా కథకు కనెక్ట్ అవుతారు. మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇది. ఇలాంటి చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉంది”అని తెలిపారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ – ఆగస్టు 15న గ్రాండ్‌గా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరామెన్ జి.మురళి, మైత్రీ సీఈవో చెర్రీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News