Sunday, December 22, 2024

ఆగస్టు 9న ‘ఖుషి’ ట్రైలర్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషి. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఖుషి సినిమా షూటింగ్  పూర్తి  చేసుకుంది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ  నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నారు.

ఇప్పటిదాకా ఖుషి నుంచి రిలీజ్  చేసిన లిరికల్ పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు రికార్డ్ వ్యూస్ రాబడుతున్నాయి. ఖుషి ట్రైలర్ పై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News