- Advertisement -
లక్నో: అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కుశినగర్ జిల్లా యుర్దహ గ్రామంలో జరిగింది. సంగీత అనే మహిళ తన ఐదుగురు పిల్లలతో కలిసి గాఢ నిద్రలోకి జారుకుంది. ఇంటిలో ఉన్న పొయ్యిలో నుంచి మంటలు ఇంటికి అంటుకున్నాయి. ఇంటికి మంటలు నలువైపులా వ్యాపించడంతో తప్పించుకోవడానికి వీలులేదు. దీంతో ఆరుగురు మంటల్లో సజీవదహనమయ్యారు. అదే సమయంలో ఆమె భర్త నవ్‌మీ ఆరబయట పడుకున్నాడు. సంగీత వయస్సు 38 సంవత్సరాలు, పిల్లల వయసు పదేళ్ల లోపు ఉంటుందని భర్త తెలిపాడు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Also Read: వైద్య రంగానికి పెద్ద పీట వేసిన సిఎం కెసిఆర్
- Advertisement -