Wednesday, January 22, 2025

మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును స్పీకర్ అందించారు.

ఈ నెల 3న జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై గెలిచిన విషయం తెలిసిందే. ఆయనపై 10 వేలకుపైగా ఓట్ల తేడాతో కూసుకుంట్ల విజయం సాధించారు.

Kusukuntla Prabhakar Reddy takes oath as MLA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News