Monday, December 23, 2024

కుసుమ జగదీశ్ నేత సేవలు చిరస్మరణీయం : తెలంగాణ పద్మశాలి మహాసభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, పద్మశాలి ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమ నాయకుడు ‘కుసుమ జగదీశ్ నేత’ అకాల మరణం పట్ల తెలంగాణ పద్మశాలి మహాసభ సంతాపం వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన తనదైన పాత్రను పోషించి క్రియాశీలకంగా పనిచేసారని, పద్మశాలీల చైతన్యానికి, సమాజ అభివృద్ధికి ఎనలేని కృషి చేసారని ‘తెలంగాణ పద్మశాలి మహాసభ’ కోఆర్డినేటర్లు బింగి ప్రవీణ్ కుమార్ నేత, తుమ్మ కృష్ణమూర్తి నేత తెలిపారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతం నుంచి నాయకుడిగా ఎదిగిన కుసుమ జగదీశ్ నేత అణగారిన వర్గాల ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, రాజకీయ చైతన్యంలో ఆయన స్ఫూర్తిని భావితరాలు అందిపుచ్చుకోవాలని తెలంగాణ పద్మశాలి మహాసభ కోరింది. జగదీశ్ నేత సమాజానికి అందించిన సేవలు మర్చిపోలేనివని, ఆయన ఆశయాల సాధనకై తెలంగాణ పద్మశాలి మహాసభ అవిరళ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాలి మహాసభ స్పష్టం చేసింది, కుసుమ జగదీశ్ నేత కుటుంబసభ్యులకు వెన్నుదన్నుగా ఉంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News