Thursday, January 23, 2025

కువైట్ లో విద్యుత్ కోతలు?!

- Advertisement -
- Advertisement -

కువైట్ లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వేసవి ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగిపోయింది. అక్కడి జల, విద్యుత్ మంత్రిత్వ శాఖ (MEWRE) ‘‘పవర్ గ్రిడ్ స్థిరత్వ నిర్వహణ కోసం విద్యుత్ కోతలు తప్పనిసరి, కొన్ని నివాస ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఇకపై ఉండనున్నాయి’’ అని ప్రకటించింది.

కువైట్ లోని అబ్దుల్లాహ్ అల్-ముబారక్, వెస్ట్ అబ్దుల్లాహ్ అల్-ముబారక్, జబేర్ అల్-అహ్మద్, సౌత్ ఝహ్రా, ఫహద్ అల్-అహ్మద్, హాదియా, సాల్మియా, ఈస్ట్ హవల్లీ, ఖైతాన్, ఫునైటిస్ ప్రాంతాల్లో ఈ విద్యుత్ కోతలు ఉండనున్నట్లు ప్రకటించింది. ప్రజలు ఉదయం 11.00 నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య విద్యుత్ ను ఆదా చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. నేడు కువైట్ లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ కు పైనే ఉంది. వాతావరణ వేత్తలు ఉష్ణోగ్రత 53 డిగ్రీల సెల్సియస్ మాదిరి ఉండగలదని హెచ్చరించారు. ఎయిర్ క్వాలిటీ కూడా అంతంత మాత్రం ఉండనుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News