Saturday, November 16, 2024

కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : కువైట్ పాలక ఎమిర్ , 86 ఏళ్ల షేక్ నవాఫ్ అల్‌అహ్మద్ అల్ జాబల్ అల్ సబా కన్నుమూశారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ మీడియా శనివారం వెల్లడించింది. నవాఫ్ మృతి చెందిన తరువాత కువైట్ టెలివిజన్ శనివారం సాధారణ కార్యక్రమాలను నిలిపివేసి, ఖురాన్ పఠనాన్ని ప్రసారం చేసింది. గత నవంబర్‌లో ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసినట్టు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. 2021 నుంచి షేక్ నవాఫ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పుడు వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లారు. ఇరాక్, సౌదీ అరేబియా సరిహద్దులు కలిగిన మధ్యప్రాచ్యదేశంలో కువైట్ పాలకుల ఆరోగ్యం చాలా సున్నితమైన విషయంగా పరిగణిస్తుంటారు. అంతర్గత అధికార పోరాటాలు జరుగుతుంటాయి. 2020లో షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా (91) మరణం తరువాత షేక్ నవాఫ్ కువైట్ ఎమిర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

అంతకు ముందు ఆయన కువైట్ అంతర్గత , రక్షణ మంత్రిగా పనిచేశారు. 1937లో జన్మించిన షేక్ నవాఫ్ , మాజీ కువైట్ పాలకుడు షేక్ అహ్మద్ అల్ జాబర్ అల్‌సబా ఐదో కుమారుడు . షేక్ నవాఫ్ బాధ్యతలు చేపట్టాక , దేశీయ సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉన్నారు. కువైట్ సంక్షేమ వ్యవస్థను పూర్తిగా మార్చేశారు. కువైట్‌లో క్షమాభిక్ష డిక్రీ ఆయన హయాం లోనే జారీ అయింది. షేక్ నవాఫ్ మరణానంతరం , షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబర్ ( 83 కువైట్ ఎమిర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. అమెరికా రాష్ట్రం న్యూజెర్సీ కన్నా చిన్నదైన కువైట్ దేశంలో 4.2 మిలియన్ మంది జనాభా ఉన్నారు. చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న ప్రపంచం మొత్తం మీద ఆరోదేశంగా ప్రాముఖ్యత సాధించింది. 1991 గల్ఫ్ యుద్ధ నుంచి అమెరికాకు బలమైన స్నేహితునిగా ఉంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News