Sunday, December 22, 2024

ప్రధాని మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం

- Advertisement -
- Advertisement -

‘ముబారక్ అల్‌కబీర్ ఆర్డర్’ ప్రదానం
మోడీకి అది 20వ అంతర్జాతీయ అవార్డు
కువైట్‌లో ప్రధాని మోడీకి వైభవోపేత స్వాగతం
కువైట్ ఎమీర్‌తో విస్తృత చర్చలు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కువైట్ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ స్వీకరించారు. అది ఆయనకు 20వ అంతర్జాతీయ అవార్డు. ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ కువైట్‌లో రాజపూర్వక గౌరవ పురస్కారం. మైత్రీ చిహ్నంగా దేశ, విదేశీ సార్వభౌమ ప్రభుత్వాధినేతలు, రాజ కుటుంబాల సభ్యులకు దానిని ప్రదానం చేస్తుంటారు. ఇంతకు ముందు ఆ అవార్డును బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జి బుష్ వంటి ప్రపంచ నేతలకు ప్రదానం చేశారు. కువైట్‌లో అధికార పర్యటన సందర్భంగా ప్రధాని మోడీకి వైభవోపేత స్వాగతం లభించింది.

ఆయనకు బయన్ ప్యాలెస్‌లో గౌరవ వందనం సమర్పించారు. కువైట్ ఎమీర్ షేఖ్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) ప్రధాని మోడీ పర్యటన వివరాలను ‘ఎక్స్’లో పంచుకుంది. ‘చరిత్రాత్మక పర్యటనకు ప్రత్యేక స్వాగతం! వైభవోపేత స్వాగతం, గౌరవ వందనానికి కువైట్‌లో బయన్ ప్యాలెస్ వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు.

కువైట్ ప్రధాని గౌరవనీయ షేఖ్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్ సాదరంగా ఆహ్వానించారు’ అని ఎంఇఎ తన ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా వర్తక, పెట్టుబడులు, ఇంధన శక్తి రంగాల్లో భారత్, కువైట్ సంబంధాలకు కొత్త ఊపు తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రధాని మోడీ ఆదివారం కువైట్ ఎమీర్ షేఖ్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్‌తో విస్తృతంగా చర్చలు జరిపారు. షేఖ్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్ ఆహ్వానంపై ఆ గల్ఫ్ దేశంలో రెండు రోజుల పర్యటన జరుపుతున్నారు. 43 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు కువైట్‌ను సందర్శించడం ఇదే ప్రథమం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News