దుబాయ్: అంతర్జాతీయంగా విమర్శలు ఎదురైనా పట్టించుకోకుండా బుధవారం ఏడుగురికి కువైట్ కోర్టు సామూహిక మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించబడిన వారిలో కువైట్‌కి చెందిన ఒక మహిళ, ముగ్గురు పురుషులు, ఒక సిరియన్, ఒక పాకిస్థానీ, ఇథియోపియా మహిళ ఉన్నారు. సెంట్రల్ జైలులో ఈ శిక్షలు అమలయ్యాయని కువైట్ వెల్లడించింది. అయితే మరణశిక్షలకు ఏ పద్ధతి వినియోగించిందో వివరించలేదు. సాధారణంగా కువైట్‌లో ఉరిశిక్ష అమలు చేస్తుంటారు. తుపాకీతో కాల్చిచంపే ఫైరింగ్ స్వాడ్‌లను కూడా వినియోగిస్తారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం హత్య చేయడం, ఇతర నేరాల కారణంగా ఈ మరణశిక్ష అమలైనట్టు ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది.
బాధితుల జీవించే పవిత్రమైన హక్కులను నేరస్థులు కొల్లగొన్నారని వ్యాఖ్యానించింది. 2017 నుంచి కువైట్ మరణశిక్షలను ఆపడం లేదు. 2017 జనవరి 25న ఒక రాజకుటుంబానికి చెందిన ఒకరితోసహా సుమారు ఏడుగురిని ఒకే రోజు ఉరితీయడం పెద్ద కలకలం రేగింది. ఐరోపా యూనియన్ ఈ మరణశిక్షలపై తీవ్రంగా విమర్శించింది. ఐరోపా కమిషన్ అధికారి మార్గరిటిస్ సినాస్ ఆదేశం సందర్శనకు వెళ్లిన సమయంలో ఇవి జరగడంపై ఆందోళన వెలిబుచ్చింది. క్రూరమైన, అమానవీయమైన ఆఈ మరణశిక్షలను పూర్తిగా ఆపేయాలని పిలుపునిచ్చింది. ఆమ్నెస్టీ అంతర్జాతీయ సంస్థ అంతకు ముందే ఈ శిక్షలను ఆపాలని కోరింది.
Kuwait Puts 7 inmates to death in rare mass execution