Tuesday, September 17, 2024

కువైట్ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు 15,000 డాలర్లు

- Advertisement -
- Advertisement -

దక్షిణ కువైట్ లోని మంగాఫ్‌లో జూన్ 12న ఒక భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 46 మంది భారతీయులతోసహా మొత్తం 50 మంది మృతి చెందిన విషాద సంఘటన తెలిసిందే. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 15,000 డాలర్ల ( రూ. 12.5 లక్షలు) వంతున కువైట్ ప్రభుత్వం పరిహారం ఇవ్వనున్నట్టు జూన్ 18న మీడియా నివేదిక వెల్లడించింది. అరబ్‌టైమ్స్ వార్తాపత్రిక సమాచారం ప్రకారం ఈ పరిహారం బాధితులకు సంబంధించిన దౌత్య కార్యాలయాలకు అందజేయ బడుతుంది.

మరో ముగ్గురు మృతులు ఫిలిప్పీన్లు. వీరిలో ఒకరి గుర్తింపు ఇంకా కాలేదు. బాధిత కుటుంబాలకు పరిహారం సక్రమంగా, సమర్ధంగా అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల వంతున ఆర్థికసాయం ప్రకటించాయి. మృతులు 46 మంది భారతీయుల్లో 24 మంది మళయాళీలు ఉన్నారు. కువైట్ ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News