Monday, January 20, 2025

‘ప్రిన్స్’కు అనూహ్య స్పందన

- Advertisement -
- Advertisement -

KV Anudeep About 'PRINCE' Movie Success

శివకార్తికేయన్ కథానాయకుడిగా అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కిన పూర్తి ఎంటర్‌టైనర్ ‘ప్రిన్స్’. మారియా ర్యాబోషప్క కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్‌మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిలేరియస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపధ్యంలో దర్శకుడు అనుదీప్ కెవి మీడియాతో మాట్లాడుతూ.. “తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా ఈ సినిమాకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది. ఒక కోస్టల్ ఏరియాలో జరిగే కథ ఇది. ప్రస్తుత పరిస్థితులలో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచననే ప్రిన్స్ కథకు స్ఫూర్తి. దీనిని వినోదాత్మకంగా ఈ సినిమాలో చెప్పాము” అని అన్నారు.

KV Anudeep About ‘PRINCE’ Movie Success

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News