- Advertisement -
మన తెలంగాణ/ హైదరాబాద్ : కరూర్ వైశ్యాబ్యాంక్(కెవిబి) రూ.1,25,000 కోట్ల వ్యాపార మార్కును అధిగమించింది. ఈ మొత్తం వ్యాపారంలో డిపాజిట్లు, అడ్వాన్స్‌లు కూడా భాగంగా ఉన్నాయి. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 2022 మార్చి 31 నాటికి రూ.68,676 కోట్లుగా ఉండగా, మొత్తం అడ్వాన్స్‌లు రూ.58,086 కోట్లుగా ఉన్నాయి. తద్వారా మొత్తం వ్యాపారం 1,26,762 కోట్ల రూపాయలకు చేరింది. కెవిబి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ రమేష్ బాబు మాట్లాడుతూ, బ్యాంక్ 100 సంవత్సరాల చరిత్రలో ఇది ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలుస్తుందని, వినియోగదారులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ 789 శాఖలు, 1,639 ఎటిఎంలు, 584 రీసైక్లర్, క్యాష్ డిపాజిట్ మెషీన్‌లను కల్గివుంది.
- Advertisement -