Sunday, December 22, 2024

ఎస్ఆర్ హెచ్  ‘వన్’డర్ ఫుల్ గెలుపుకు చిందులేసిని కావ్య మారన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిన్న(మే 2 న) చివరి బంతి వరకు గెలుస్తామో ఓడుతామో తెలియని హైదరాబాద్ జట్టు చివరి బంతిలో గెలిచింది. ప్రముఖ బిజినెస్ మన్ కళానిధి మారన్ కూతురు కావ్య మారన్(31) సంతోషాన్ని ఆపుకోలేక చిందులేసింది. ఆమె సన్ గ్రూప్ హైదరాబాద్ యజమాని.  ఐపిఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సిఈవో. ఆమెకు ఇష్టమైన ప్రదేశం అమెరికా. ఇష్టమైన రంగు ఆరెంజ్(నారింజ). ఆమెకు ట్రావెలింగ్, మ్యూజిక్ అంటే ఇష్టం.

హైదరాబాద్ జట్టు ఓటమి ఖాయమనుకుని దిగాలుగా కూర్చున్న ఆమె చివరి బంతితో జట్టు గెలిచేసరికి సంతోషం పట్టలేక చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ గంతులేసింది. గెలుపును వేడుక చేసుకుంది. ఆమె ఆనందాన్ని చూసి అంతా చూస్తుండిపోయారు. భువనేశ్వర్ కుమార్ చివరి బంతిలో (3/41) ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ విజయావకాశాలను తల్ల కిందులు చేసేశారు. హైదరాబాద్ జట్టు 201 టార్గెట్ పెట్టగా, రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 200 పరుగులు చేసి ఓడింది.

Bhuvaneshwar 1

Bhuvaneshwar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News