Sunday, January 19, 2025

నిక్ జోడీకి డబుల్స్ టైటిల్

- Advertisement -
- Advertisement -

Kyrgios, Kokkinakis win men’s doubles title

 

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను నిక్ కిర్గిస్‌తాన్సి కొకినాకిస్(ఆస్ట్రేలియా) జంట కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో నిక్ జోడీ 75, 64 తేడాతో ఆస్ట్రేలియాకే చెందిన మాథ్యూఎబ్డెన్, మాక్స్ పుర్సెస్ జంటను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో ఇరు జోడీలు అద్భుత పోరాట పటిమను కనబరిచాయి. ఇటు నిక్ జంట అటు మాథ్యూ జోడీ దూకుడైన ఆటను కనబరచడంతో హోరాహోరీ తప్పలేదు. ఇదే క్రమంలో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన నిక్ జోడీ సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. కానీ కీలక సమయంలో మాథ్యూ జంట ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన నిక్ జోడీ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News