Saturday, November 23, 2024

అయోధ్యలో మందిర నిర్మాణం విధి నిర్ణయం: ఎల్‌కె అద్వానీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం జరగాలనేది విధి నిర్ణయమని, అందుకు అది ప్రధాని మోడీని ఎంచుకున్నదని బిజెపి వృద్ధ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె ఆద్వానీ పేర్కొన్నారు. వచ్చే వారం ప్రచురితం కానున్న ‘రాష్ట్రధర్మ ’ ప్రత్యేక ఎడిషన్‌లో రాసిన ఓ ఆర్టికల్‌లో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ రామమందిర్ నిర్మాణ్, ఏక్ దివ్య స్వప్న కీ పూర్తి’ పేరుతో రాసిన ఆ వ్యాసంలో అద్వానీ 33 ఏళ్ల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం తాను చేపట్టిన రథయాత్రను గుర్తు చేసుకున్నారు. అయోధ్య ఉద్యమం తన రాజకీయ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన, పూరిత్గా మార్చివేసిన సంఘటన అని తాను నమ్ముతానని , అది భారత దేశాన్ని తిరిగి కనుగొనడానికి, ఆ ప్రక్రియలో తనను మళ్లీ అర్థం చేసుకోవడానికి తోడ్పడిందని ఆయన పేర్కొన్నారు.

రామమందిర ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న అద్వానీ ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని గుర్తు చేసుకుంటూ, అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆయన లేని లోటు తనను బాధిస్తోందన్నారు.‘ ఈ రోజు రథయాత్ర 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1990 సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం మేము ఈ యాత్రను ప్రారంభించినప్పుడు భగవాన్ రాముడిపై నమ్మకంతో తాము ప్రారంభించిన ఈ యాత్ర ఒక ఉద్యమంగా మారుతుందని మేము ఊహించలేదు’ అని అద్వానీ ఆ వ్యాసంలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ యాత్ర పొడవునా తనతో ఉన్న విషయాన్ని అద్వానీ గుర్తు చేశారు.

‘ఆ సమయంలో ఆయన అంత ఫేమస్ కాదు. అయితే ఆ సమయంలో శ్రీరాముడు తన ఆలయాన్ని నిర్మించడానికి ఈ భక్తుడి( మోడీ)ని ఎంచుకున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం అవుతుందని ఆ సమయంలో నాకు అనిపించింది. అది ఇప్పుడు మరి కొన్ని రోజుల్లోనే నెరవేరబోతోంది’ అని అద్వానీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News