Sunday, April 13, 2025

పవన్‌ కుమారుడిని కాపాడిన వారికి సత్కారం!

- Advertisement -
- Advertisement -

ఎపి డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవలే అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని చేతులకు గాయాలు కాగా.. ఊపిరితిత్తులో పొగ చేరింది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దాంతో మార్క్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే మార్క్ శంకర్‌తో పాటు పలువురిని ఈ ప్రమాదం నుంచి కాపాడిన వారిని సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది.

సింగపూర్‌లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్‌ సమీపంలో రివర్ వ్యాలీ రోడ్డులోని మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ సమీపంలో పని చేస్తున్న కార్మికులు మూడో అంతస్తు నుంచి పొగ రావడాన్ని గమనించారు. హుటాహుటిన వెళ్లి మంటల్లో చిక్కుకున్న 15 మంది పిల్లలతో సహా 20 మందిని కాపాడారు. దీంతో తమ ప్రాణాలకు తెగించి ఇందరిని కాపాడిన ఆ నలుగురిని సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News