Sunday, December 22, 2024

మియాపూర్ లో లేబర్ హత్య

- Advertisement -
- Advertisement -

హోటలో అడగకుండా నీరు తీసుకున్నాడని హోటల్ వ్యక్తులు ఆగ్రహానికి గురై నీరు తీసుకున్న వ్యక్తిని కొట్టీ చంపిన సంఘటన ఇవాళ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా టెక్మల్ మండలం బోడ గట్టు కు చెందిన చాకలి సాయిలు 30 మీనా ఇద్దరు కుమారులు మాహి 6 , కిరణ్ 4 ఉన్నారు. బీరంగూడాలో ఉంటూ మియాపూర్ లో ఇసుక అన్ లోడ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

ఇసుక కాలి చేయడానికి వచ్చిన సాయిలు పక్కనే వున్న హోటల్ లో నీరు తాగేందుకు వెళ్ళాడు. అడగకుండా నీరు తాగుతున్నాడని సాయిలు ను హోటల్ లో పనిచేసి వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఆగ్రహంతో హోటల్ లో పనిచేసే వారు సాయిలు కాళ్ళు కట్టి గొంతుకు టవల్ కట్టి బిగించి హత్య చేశారు.స్థానికుల సమాచరం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News