Monday, December 23, 2024

కార్మిక పక్షపాతి ఎంపి నామా

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : కార్మికుల కష్ట సుఖాలు ఎరిగిన నాయ కుడు ఎంపి నామా నాగేశ్వర రావు అని రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వ రరావు పేర్కొన్నారు. ఎంపి నామా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఖమ్మం, టేకులపల్లిలోని కేసీఆర్ టవర్స్ ఆటో కార్మికుల అడ్డాలో మంగళవారం నామా ముత్తయ్య ట్రస్ట్ నేతృత్వంలో 212 మంది ఆటో కార్మికులకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్య క్రమంలో నల్లమల మాట్లాడు తూ ఎంపి నామా కార్మిక పక్ష పాతి అన్నారు. ఎంపి నామా ఎప్పుడూ కార్మిక పక్షంగా ఉంటూ ఎప్పుడు ఏ కష్టమొ చ్చినా నేనున్నాంటూ వారిని ఆదుకుంటూ భరోసా కల్పించ డం ఆయన నైజమని అన్నారు.

తన తండ్రి నామా ముత్తయ్య పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చరిత్ర నామాది అన్నారు. ప్రజా సేవలకు చిరు నామా నామా అన్నారు. సేవా కార్యక్రమాల్లో ఎంపి నామా దిట్టా అని అన్నారు. ప్రతి వారం లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్న ఘనత నామా నాగేశ్వరరావుకు దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పేద వర్గాలకు పంపిణీ చేసిన చరిత్ర నామాది అని నల్లమల పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చిలకల వెంకటనర్సయ్య యాదవ్, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, నాయకులు వాకదాని కోటేశ్వరరావు, టేటేశ్వరరావు కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల ఇన్చార్జి షేక్ రహీం, నామా సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్, భార్గవ్, టేకులపల్లి అడ్డా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పొదిల నాగరాజు, ఉపాధ్యక్షుడు ఎండీ యాసిన్, ప్రధాన కార్యదర్శి కొర్రి రామారావు, కోశాధికారి వారా నాగరాజు, కమిటీ సభ్యులు పిల్లి రామకృష్ణ, పొదిల గోపి, వీరారెడ్డి, షఫీ, డుంగ్రోత్ గోపీ, కే.వినయ్, గుంటి శ్రీను, వైబీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News