Sunday, November 24, 2024

సింగరేణిలో ఎన్నికలపై కార్మిక సంఘాలతో సమావేశమైన లేబర్ కమిషనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సింగరేణిలో ఎన్నికలకు సంబంధించిన లేబర్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం 14 కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి యాజమాన్యం ప్రతినిధుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. తెలంగాణ హైకోర్టు ఎన్నికలను మూడు నెలలో నిర్వహించాలని ఆదేశించడంతో. ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా ఈ సంవత్సరం నిర్వహించనున్న కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా ఈ సమావేశంలో జర్చ జరిగింది. సాధారణంగా ఏదైనా ట్రేడ్ యూనియన్ ఎన్నికల కాల వ్యవధి రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుందని, అది ముగిసిన వెంటనే అది చెల్లుబాటు కాదని 10 సంఘాల ప్రతినిధులు తమ వాదనల వినిపించారు.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి ఎన్నిలకు నిర్వహించడం ద్వారా సంస్థపై ఆర్ధిభారం పడుతుందని, అంతే కాకుండా ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని 4 సంవత్సరాలకు ఒక సారి ఎన్నికలు నిర్వహించడమే సహేతుకమని 3 సంఘాలు ప్రతినిధులు కమిషనర్‌కు వివరించారు. రెండు సంఘాల ప్రతినిధులు వాదనలు విన్న లేబర్ కమిషనర్ ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ, అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, సూచించగా రెండు సంఘాల ప్రతినిధులు వాటికి అంగీకరించారు. ఈ నెల 26న మరో మారు సమావేశం నిర్వహించి అగస్టులో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలుపగా రెండు సంఘాల ప్రతినిధులు అంగీకరించడంతో సమావేశం ముగిసింది. లేబర్ కమినర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సింగరేణి యాజమాన్యం, 14 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News