- Advertisement -
ప్రమాదవశాత్తు కార్మికుడు కింద పడిపోయి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కిస్మత్ పూర్ లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రేమవతి పేట్ కు చెందిన మల్లేష్ కిస్మత్ పూర్ లోని ఒక అపార్ట్ మెంట్ ఐదవ ఫ్లోర్ లో సంపు క్లీన్ చేస్తుండగా ప్రమాదవ శాత్తు కింద పడిపోయాడు. ఈ ఘటన లో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని చేరుకున్న కుటుంబ సభ్యులు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.
- Advertisement -