Thursday, January 23, 2025

వలస కూలీల పక్షులకు స్వర్గధామం పాలమూరు

- Advertisement -
- Advertisement -

నాడు పాలమూరు వలస
నేడు ఇక్కడికే ఇతర రాష్ట్రాల వలస
మారుతున్న పాలమూరు స్వరూపం
సాగునీటి,24గంటల విద్యుత్‌తో
పెరుగుతున్న ఉపాధి
ఒరిస్సా,బీహార్, యుపి, మధ్యప్రదేశ్, రాయలసీమ నుంచి వలసలు
నాడు కన్నీటి వ్యధ నేడు
ఉపాధికి భరోసా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 వేలకు
పైగా ఉపాధి పొందుతున్న
ఇతర ప్రాంత కూలీలు

 

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోయింది. నాడు ఇదే పాలమూరు నుంచి లక్షలాది మంది రైతులు,కూలీలు, చేతిలో పనుల్లో లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే వారు. ఊళ్లకు ఊళ్లు ఇళ్లల్లో తాలాలే కనిపించేవి,ఇళ్ల దగ్గర ముసలి వాళ్లు, చిన్న పిల్లలు తమ వారు ఎప్పుడెప్పుడు వస్తారా అని కల్లల్లో ఒత్తులు పెట్టుకొనే ఎదురు చూపులు.. వలస పోయిన వారు తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేని జీవితాలు. గుంపు మేస్త్రీల చేతిలో బందిలే… వెట్టిచాకిరి చేస్తూ ఆర్థ్దిక దోపిడీకి గురికాక తప్పని స్థితి. సంవత్సరాలు పాటు కష్టపడి పని చేసినా వడ్డికిందనే జమ చేసుకునే గుంపు మేస్త్రీ దోపడి ఒక వైపు.. మరో వైపు వలస పోయిన ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు..ఇలా ఒక్కటేమిటి జీవితాలన్నీ ఘోస, ఘోసగానే ఉండేది.

దేశంలో ఏ ప్రాజెక్టు అయినా నిర్మాణం అవుతుంటే అక్కడ పాలమూరు వలస కూలి ఉండాల్సిందే. ఇలా శ్రమ దోపిడీకి గురౌతూ బానీస బతుకులు బతుకులు జీవితాలు దుర్బరంగా ఉండేవి. నెర్రెలు వారిన నేలలతో పల్లేర్ల పండే పొలాలో ఉపాధి లేక రైతుల ఆత్మహత్యలు ఇలా ఒకటేమి. ఎన్నెన్నో కష్టాలు కడగండ్లు… ఇవన్నీ ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పడు పాలమూరు కన్నీటి ఘోస ఇది.

కెసిఆర్ చొరవతోనే ఇదంతా : తెలంగాణా రాష్ట్రం సిద్దించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరుపై ప్రత్యేక శ్రద్ధ్ద వహించాడు. పాలమూరు కన్నీటి వ్యధను తీర్చాలని కంకణం కట్టుకున్నాడు. పాలమూరు సశ్యశ్యామలం చేయాలని భావించారు. అనుకున్నదే తడువుగా సాగునీటి రంగానికి ప్రాధాన్యత కల్పించారు. పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. ప్రతిష్టాత్మక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. చెరువులు పూడిక తీయించి కాల్వల ద్వార నీటిని నింపారు. జూరాల నీటిని అన్ని నియోజకవర్గాలకు తరలించారు. తద్వారా సాగునీటి రంగంలో వృద్ధ్దిలోకి వచ్చింది.

కరువు నేలలుగా ఉన్న భూ ములు నీటితో కళకళలాడాయి. రైతులకు ఉచిత విద్యత్ ఇవ్వడంతో వ్యవసాయం పండుగలా మారింది. సిఎం కెసిఆర్ రైతులకు పెట్టుబడి స హాయం కింద ఎకరాకు రెండు పంటలపై రూ. 10 వేలు ఇచ్చారు.అంతేకాకుండా రైతు ఎలా చనిపోయినా రైతు బంధు కింద రూ. 5 లక్షలు చెల్లించారు. ఇలా క్రమ పద్దతిలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ది పథంలో నడిపించారు. లక్షల ఎకరాల్లో వరి దాన్యం పండించారు. గతంలో వరి మెతుకుకు ఇబ్బంది పడ్డ పాలమూరు నేడు ఇతర రాష్ట్రాలకు అన్నంపెట్టే విదంగా దాన్యం పండించడం విశేషం. వ్యవసాయ రంగం ఒక వైపు పారిశ్రామిక రంగంను మరో వైపు వృద్ధి చేస్తూ వచ్చారు. జడ్చర్ల దగ్గర పరిశ్రమల కోసం సెజ్‌ను ఏర్పాటు చేయడంతో వందలాది పరిశ్రమలు వచ్చి వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల చోటా మోటా చిన్న తరహా, మద్య తరహా పరిశ్రమలు వస్తుండడంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతూ వచ్చాయి. అందమైన జా తీయ రహదారులు, రాష్ట్ర రహదారులు పెరుగడ ంతో పారిశ్రామీకంగా ఎంతో ఘననీయంగా వృద్దిలోకి వచ్చింది.

వేలాదిగా వస్తున్న ఒరిస్సా, బీహార్,యుపి,మద్య ప్రదేశ్, రాయలసీమ నుంచి వలసలు : పాలమూరు ముఖ చిత్రం మారడంతో ఒరిస్సా, బీహార్, ఉత్తర ప్రదేశ్, మద్య ప్రదేశ్, రాయలసీమ నుంచి పాలమూరుకు కూలీలు వలసలు వస్తున్నారు. నాడు వలస కూలీ నేడు యజమానిగా మారిపోయాడు. అత్యధికంగా ఒరిస్సా నుంచి ఇటుకల బట్టిల్లో పని చేసేందుకు ఎక్కవగా వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటుక రంగం పెద్ద ఎత్తున ఉండడంతో ఈ రంగంలో పని చేసేందుకు ఒరిస్సా నుంచి కూలీలు వస్తున్నారు. అలాగే బీహార్ కూలీలు ఇళ్ల నిర్మాణంలోనూ, విద్యత్ స్థంబాల పనుల్లోనూ, రైస్ మిల్లర్లలో పని చేసేందుకుగానూ, ఇళ్లకు రంగులు వేడయడంలో వలసలు వస్తున్నారు.

ఇక్కడ కూలీలకు రోజు రూ. 500 నుంచి 800 దాక ఉండడంతో ఇతర రాష్ట్రాల కూలీలు ఎక్కువగా వస్తున్నారు.ఇక యూపికి చెందిన వారు పాడి రంగంలో పని చేసేందుకు వస్తున్నారు.ఇక రాయలసీమ నుంచి వచ్చే కూలీలు అత్యదికంగా వ్యవసాయ కూలీలుగానూ వస్తున్నారు. అన్ని సీజన్‌లోనూ పాలమూరులో వలస కూలీలు వచ్చి జీవనోపాది పొందుతున్నా రు. దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యా ప్తంగా 20 వేలకు పైగా వలస కూలీలు ఉపాధి పొందుతుండవచ్చునని అంచనా వేస్తున్నారు. వీ రికి పూర్తి రక్షణ కూడా ఇక్కడ ఉండడంతో అనేక మంది ఇతర రాష్ట్రాల వాళ్లు ఇక్కడ వచ్చి ఉపాది పొందుతున్నారు. ఇక పట్టణాల్లో రాజస్థాన్, గుజరాత్ నుంచి వస్తున్నారు. వీరు ఎక్కవగా వ్యాపార రంగంలో ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News