హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ సారధ్యంలో రైతులకు నిరంతర విద్యుత్ సహా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని కార్మికశాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్ మల్లా రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లాలోని పలు చోట్ల పాల్గొని రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వెల్లడించారు.
ముందుగా మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలోను, శామీర్ పేట్ మండలంలోని అలియాబాద్‌లోనూ, మేడ్చల్ మండలం రాయిలాపూర్‌లోని రైతు వేదికల వద్ద నిర్వహించిన రైతు దినోత్సవాల్లో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తు.. రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రైతు భీమా, రైతు బందు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు , రైతులకు సొసైటీల ద్వారా సబ్సీడీల గురించి ఆయన ప్రస్తావించారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయన్నారు.
ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందన్నారు. నాటి ఉద్యమ నాయకుడిగా నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ చేపట్టిన కార్యాచరణతో నేడు తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలోనే దేశానికే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దే స్పూర్తిగా ప్రస్తుతం పలు రాష్ట్రాలు తమ కార్యాచరణను పొందించుకుంటున్నాయన్నారు. సకల వర్గాల సంక్షేమమే లక్షంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ బాటలో నడుస్తున్నాయని మంత్రి మల్లా రెడ్డి వెల్లడించారు.
సిఎం కెసిఆర్ సారథ్యంలో ఉజ్వలంగా ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రస్తానానికి ఇదే నిదర్శనమని అన్నారు. అన్నింటికీ మించి తక్కువ ధరలకే ఎరువులు అందిస్తూ రైతులకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదిగిందని, అది సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ సారధ్యంలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించారని తెలిపారు. రైతు భీమా, రైతు బందు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతులకు సొసైటీల ద్వారా సబ్సీడీలు, తక్కువ ధరలకే ఎరువులు అందిస్తూ రైతులకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని కొనియాడారు. అంతే కాదు.. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదిగిందని, అది సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ మధుకర్ రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ పులిమామిడి నారాయణ, మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ జిల్లా రైతుబందు అద్యక్షులు నందారెడ్డి, మూడుచింతలపల్లి, శామీర్ పేట్, మేడ్చల్ మండలాల ఎంపీపీలు హారిక మురళీ గౌడ్, ఎల్లు బాయి బాబు, రజిత రాజమల్లారెడ్డి, శామీర్ పేట్, మేడ్చల్ మండలాల జెడ్పీటీసీలు అనిత లాలయ్య, శైలజ విజయనంద రెడ్డి, మూడుచింతలపల్లి, శామీర్ పేట్, మేడ్చల్ మండలాల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, విలసాగరం సుదర్శన్, దయానంద్ యాదవ్, మేడ్చల్, డబిల్ పూర్ సొసైటీ ఛైర్మన్ లు రణదీప్ రెడ్డి, సురేష్ రెడ్డి, భారీ సంఖ్యలో రైతులు, నాయకులు పాల్గొన్నారు. కాగా అంతకు ముందు మూడుచింతలపల్లిలో బోనాలతో మంత్రి మల్లారెడ్డి ట్రాక్టర్‌పై ర్యాలీ నిర్వహించారు.