Sunday, December 22, 2024

బ్రిటన్ లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. ఈ పరాజయానికి ఆయన బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిచింది. ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ కు సునాక్ అభినందనలు తెలిపారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’’ అని సునాక్ తెలిపారు. ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక ఆయన తన నియోజకవర్గం అయిన రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్లోని పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటమికి బాధ్యత వహిస్తున్నానని, క్షమించమని కోరారు. అయితే సునాక్ మరో మారు ఎంపీగా విజయం సాధించారు.

ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారం దక్కాలంటే 326 సీట్లలో గెలవాలి. ఇప్పటికే లేబర్ పార్టీ మెజార్టీ మార్కును దాటేసి భారీ విజయంవైపుకు వెళుతోంది. లేబర్ పార్టీ 400 మార్కు దిశగా ముందుకు కదులుతుండగా, కన్జర్వేటివ్ పార్టీ 80 స్థానాలు దాటింది.

Rishi Sunak

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News