- Advertisement -
న్యూఢిల్లీ: భారత్, చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ల మధ్య ఇటీవల మొదలైన వాస్తవాధీన నియంత్రణ రేఖ 13వ రౌండ్ చరలు చివరికి ప్రతిష్టంభనతో ముగిశాయి. భారత్ తరఫున ‘నిర్మాణాత్మక సూచనలు చేశాం’ అని సైన్యం చెబుతుంటే, చైనా మిలిటరీ ‘అహేతుకమైన, అసహజమైన డిమాండ్లను భారత్ చేసింది’ అని తన ప్రకటనలో పేర్కొంది.
గత ఏడాది నుంచే లడఖ్ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వీటిని తగ్గించడానికి కోర్ కమాండర్ల స్థాయిలో పలుమార్లు చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి ఫిబ్రవరిలో, గోగ్రా ప్రాంతం నుంచి ఆగస్టులో రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి.
- Advertisement -