Sunday, January 5, 2025

భూ సమస్యలకు పరిష్కార భారతి

- Advertisement -
- Advertisement -

భూభారతితో రైతులకు మెరుగైన రెవెన్యూ సేవలు కొత్త చట్టాన్ని
నిజాయితీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నిరకాల
భూసమస్యలకు పరిష్కారం లభించేలా కొత్త చట్టం తెచ్చాం : సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ :భూ భారతితో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రెవె న్యూ సేవల చట్టాన్ని నిజాయితీగా అమలు చే యాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ చట్టం అమల్లోకి వస్తే రెవెన్యూ సేవలు సులభతరం అ వుతాయని, భూ భారతితో రాష్ట్రంలోని రైతుల కు మెరుగైన రెవెన్యూ సేవలు అందుబాటులో కి వస్తాయని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త చట్టంతోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిఎం అన్నారు. తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టిజిటిఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టిజిఆర్‌ఎస్ ఏ) నూతన సంవత్సర డైరీల ఆవిష్కరణ బుధవారం సిఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి తో సిఎం రేవంత్ కొత్త ఆర్‌ఓఆర్ చట్టం,

దానిలోని ప్రధాన అంశాల గురించి చర్చించారు. ధరణితో రాష్ట్రంలో భూ సమస్యలు పెరిగాయ ని ఈ సందర్భంగా సిఎం పేర్కొన్నారు. రైతుల కు, ప్రజలకు రెవెన్యూ సేవలను వేగంగా, సులభంగా అందించే లక్ష్యంతోనే భూభారతిని తీ సుకొచ్చినట్టుగా సిఎం వారితో చెప్పారు. జిల్లా స్థాయిలోనే అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం లభించే విధంగా కొత్త చట్టాన్ని రూ పొందించామని సిఎం రేవంత్ తెలిపారు. ఇదే కాకుండా రెవెన్యూ అధికారులకు సైతం వివిధ స్థాయిల్లో అధికారాలను కల్పించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా సమర్ధవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ అధికారుల, ఉద్యోగుల మీదనే ఉందన్నారు. భూభారతిలో కల్పించిన అధికారాల వికేంద్రీకరణతో క్షేత్రస్థాయిలోనే రైతులకు కావాల్సిన రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయని సిఎం తెలిపారు. ఇదే కాకుండా ప్రతి రెవెన్యూ గ్రామంలోనూ ఒక రెవెన్యూ అధికారి ఉండేలా చూస్తానని సిఎం రేవంత్ హామీనిచ్చారు.

తహసీల్దార్ల బదిలీలను చేపట్టాలని సిఎంకు లచ్చిరెడ్డి వినతి
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తహసీల్దార్లను వివిధ జిల్లాలకు బదిలీ చేశారని ఈ సందర్భంగా వి.లచ్చిరెడ్డి సిఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను నేటి వరకు కూడా సొంత జిల్లాలకు బదిలీ చేయలేదన్నారు. దీంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సిఎంకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సిఎం సాధ్యమైనంత త్వరలోనే బదిలీల ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టనున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్సింగ్ చౌహాన్, శ్రీనివాసులు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, మహిళా అధ్యక్షురాలు సుజాతచౌహాన్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News