Friday, December 20, 2024

బస్టాండ్‌లో మౌలిక వసతులు కరువు

- Advertisement -
- Advertisement -

అమరచింత :నియోజకవర్గ కేంద్రమైన అమరచింత బస్టాండ్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు హయాంలో బస్టాండ్ మంజూరైంది. బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తైనప్పటికి బస్టాండ్‌లో బస్సు సౌకర్యాలు, మౌలిక వసతులు లేవు. అమరచింత బస్టాండ్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా దీనిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాణికులకు బస్టాండ్‌లో కనీస వసతులైన తాగునీరు, బాత్రూంలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు.

ఇక వర్షాకాలం వచ్చిందంటే బస్టాండ్ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరుగుతుండడం వల్ల పాములు, విష పురుగులకు నివాస స్థలంగా మారిందని, అంతే కాకుండా రాత్రివేళలో మందుబాబులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌లో లైటు సౌకర్యాలు లేవు, సోలార్ లైట్లు ఉన్నా వెలగని పరిస్థితి నెలకొంది. బస్టాండ్‌లో ఉన్న సమస్యలపై పలుమార్లు పాలకులు, అధికారులకు విన్నవించుకున్న పట్టించుకున్న దాఖలాలు కరువయ్యాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం, మున్సిపాలిటీ కేంద్రమైన అమరచింత బస్టాండ్ దుస్థితి ఇదేనా అంటూ ప్రయాణికులు చింతిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు బస్టాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News