Friday, November 22, 2024

లద్ధాఖ్ హిల్‌కౌన్సిల్ ఎన్నికల్లో బిజెపి చిత్తు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కీలకమైన లద్ధాఖ్ స్వయంప్రతిపత్తి హిల్ కౌన్సిల్ (ఎల్‌ఎహెచ్‌డిసి ) ఎన్నికలలో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. 22 స్థానాలున్న హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఇప్పటికి బిజెపితో పోలిస్తే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి చాలా ముందంజలో ఉంది. కౌంటింగ్ తరువాత వెలువరించిన ఫలితాలలో కాంగ్రెస్‌కు 8, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 11 స్థానాలు దక్కాయి. బిజెపి కేవలం రెండు స్థానాలను గెల్చుకుంది. ఒక్కస్థానంలో ఇండపెండెంట్ గెలిచారు. కార్గిల్ ప్రాంతంలో బలాబలాల నిర్ధేశిత కౌన్సిల్‌గా ఈ హిల్ కౌన్సిల్ నిలిచింది.

ఇప్పటి ఫలితాలపై పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందించారు. లౌకిక పార్టీలైన ఎన్‌సి, కాంగ్రెస్‌లు కార్గిల్‌లో గెలవడం మంచి పరిణామమని తెలిపారు. కాగా ఓట్లు చీలకుండా చేసేందుకు ఈ ఎన్నికలలో పిడిపి పోటీ చేయలేదు. 2019 తరువాత జరిగిన ఈ తొలి ఎన్నికలలో లద్ధాఖ్ ప్రాంత ప్రజలు ఈ ఓటుతో తమ గళం విన్పించారని ముఫ్తీ వ్యాఖ్యానించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ థాంక్యూ కార్గిల్ అని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాట్లలో ఇండియా కూటమి విజయానికి ఈ పరిణామం తొలి సంకేతం అని ప్రతిపక్షాలు స్పందించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News