కార్గిల్‌కు విమాన సౌకర్యం కల్పించండి : కేంద్రానికి లడఖ్ ఎల్‌జి విజ్ఞప్తి
లెహ్: కార్గిల్‌కు విమానాల రాకపోకల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వంతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కె మాథుర్ చర్చించారు. కార్గిల్‌కు క్యు-400 బంబార్డియర్ టర్బోప్రాప్ విమానం నడపడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ)ను కోరారని అధికార ప్రతినిధి ఒకరు శనివారం తెలిపారు. సాధ్యమైనంత త్వరలో కార్గిల్, తోయిసే(నుబ్రా)కు ఉడాన్ పథకం కింద చిన్న విమానాలను నడపడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా మాథుర్ కేంద్రాన్ని కోరారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమానాల నిర్వహణతోపాటు లడఖ్‌లో విమానయాన సౌకర్యాలపై కూడా ఆయన చర్చించారు. ప్రయాణికులను అత్యవసరంగా తరలించడానికి ముఖ్యంగా శీతాకాలంలో, వైద్య అత్యవసర పరిస్థితులలో, కొవిడ్ రోగుల తరలింపులో భారతీయ వాయు సేన విమానాలపై ఆధారపడకుండా పవన్ హంస్ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచినందుకు ఆయన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.