Sunday, December 22, 2024

నిరవధిక నిరసన దీక్షకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

లడఖ్ ఉద్యమ నేతల ప్రకటన
నిరసన వేదిక కోసం ఇంకా అన్వేషణ
న్యూఢిల్లీ : లడఖ్‌కు ఆరవ షెడ్యూల్ ప్రతిపత్తి కోసం ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, కార్గిల్ ప్రజాస్వామ్య కూటమి (కెడిఎ) సభ్యుడు సజ్జద్ హుస్సేన్ కార్గిలి తాము ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని, కానీ అందుకు ఇంకా వేదిక లభ్యం కావలసి ఉందని శనివారం చెప్పారు. వాంగ్‌చుక్, కార్గిలితో కలసి మరి కొందరు కూడా దీక్షలో పాల్గొనగలరని లడఖ్‌కు చెందిన మరొక నేత తెలిపారు.

రాష్ట్రపతితో, ప్రధానితో లేదా కేంద్ర హోమ్ శాఖ మంత్రితో సమావేశం కోసం తమ డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రానందున తాను, లడఖ్‌కు చెందిన ఇతర నిరసనకారులు నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు వాంగ్‌చుక్ శుక్రవారం ప్రకటించారు. అయితే,ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు తమను అనుమతించాలని కోరినట్లు, కానీ తమకు ఇంకా అనుమతి లభించనట్లు వాంగ్‌చుక్ శనివారం ధ్రువీకరించారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్ష గురించి ప్రకటన చేస్తూ, తమ నిరసనకు ఒక వేదికను చూపవలసిందిగా అన్ని వర్గాలు, పార్టీలు, సంస్థలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News