Thursday, January 23, 2025

‘లేడీస్ స్పెషల్ బస్సు’కు ఆదరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐటీ కారిడార్లో ప్రయాణించే మహిళల కోసం టిఎస్ ఆర్టీసి ప్రా రంభించిన ‘లేడీస్ స్పెషల్ బస్సుకు’ ఆదరణ ల భించింది. సోమవారం నుంచి మహిళల కోసం ‘లేడీస్ స్పెషల్ బస్సు’లను ఆర్టీసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సులు అందుబాటులోకి రావడంతో మహిళలు వాటిలో ప్రయాణించడానికి ఆసక్తి చూపారు. జేఎన్‌టియూ నుంచి వేవ్ రాక్ రూట్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బస్సు సేవలందించనుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టిఎస్ ఆర్టీసి ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తుంది.

ఆక్యుపెన్సీ పెంచి సంస్థను లాభాల బాట పట్టించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టికెట్ ధరలపై డిస్కౌం ట్లు, పండుగల సమయాల్లో ప్రత్యేక ఆఫర్లతో ప్రయాణికుల ఆదరణ పొందేందుకు సంస్థ కృషి చేస్తోంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను టిఎస్ ఆర్టీసి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐటీ కారిడార్‌లో ఉద్యోగం చేసే మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసి ఎండి సజ్జనార్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News