Sunday, November 24, 2024

విద్యార్థినిని జుట్టు పట్టుకుని లాగిన మహిళా కానిస్టేబుల్ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

ఒక విద్యార్థినిని జుట్టు పట్టుకుని ఈడ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ ను అధికారులు సస్పెండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థినిని మహిళా కానిస్టేబుల్  స్కూటర్ పై కూర్చుని జుట్టు పట్టి కింద పడేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ సంఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వవలసిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.

రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్శిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడాన్ని  నిరసిస్తూ యూనివర్శిటీ ప్రాంగణంలో గత వారం విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇందులో పాల్గొన్న ఒక విద్యార్థినిని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు వెంటాడారు. వెనకాల కూర్చున్న కానిస్టేబుల్ విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగి కిందపడేసింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ దృశ్యాలను చూసిన బిఆర్ఎస్, బిజెపి నాయకులు జరిగిన సంఘటనను ఖండించారు. ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవలసిందిగా డిమాండ్ చేశారు. మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని, నిందితులకు శిక్ష పడేలా చేయాలంటూ బిఆర్ఎస్ నాయకురాలు కవిత కూడా డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News