Friday, December 20, 2024

లేడీ కానిస్టేబుల్స్ డ్యాన్స్ వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్:  పాపులర్ పాటలకు స్టెస్సులేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా రాత్రికి రాత్రి స్టార్స్‌గా మారిన వారిని చాలా మందిని చూస్తుంటాం. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో తమ డ్యాన్స్ రీల్ పోస్ట్ చేసిన నలుగురు మహిళా కానిస్టేబుల్స్ చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతంం ట్రెండింగ్‌లో ఉన్న పత్లీ కమరియా మోరీ అనే భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన నలుగురు లేడీ కానిస్టేబుల్స్‌ను ఎస్‌ఎస్‌పి మునిరాజ్ సస్పెండ్ చేశారు.

అయోధ్యలో విధుల్లో ఉన్న ఈ లేడీ కానిస్టేబుల్స్ ఆఫ్ డ్యూటీలో ఉండగా తీసిన ఈ వీడియోపై అడిషనల్ ఎస్‌పి పంకజ్ పాండే ఇచ్చిన ఫిర్యాదుపై కవితా పటేల్, కామిని కౌష్వాహ, కషీస్ సాహ్ని, సంధ్యా సిండ్‌ను ఎస్‌ఎస్‌పిలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ వీడియోలో యూనిఫామ్‌లో లేని ఒక లేడీ కానిస్టేబుల్ డ్సాన్స్ చేస్తుండగా మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. మరో కానిస్టేబుల్ కెమెరా వెనుక ఉన్నట్లు ఎఎస్‌పి ఫిర్యాదును బట్టి తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News