Friday, January 31, 2025

క్లాస్ రూమ్ లో స్టూడెంట్ తో ప్రొఫెసర్ పెళ్లి

- Advertisement -
- Advertisement -

మిగతా స్టూడెంట్లు అంతా చూస్తుండగా క్లాస్ రూమ్ లో ఓ విద్యార్థిని ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ లోని కాలేజీ స్టూడెంట్ ప్రొఫెసర్ వివాహం వీడియో వైరల్ కావడంతో యూనివర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు. పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు, అలంకరణ, పూలదండలు, హల్దీ .. వంటి అన్ని తంతులూ కన్పించాయి. కాగా, వీడియో వైరల్ కావడంతో ఇది నిజమైన వివాహం కాదని ప్రొఫెసర్ బుకాయిస్తున్నాడు. కాలేజీలో వివాహం తంతును విద్యార్థులకు వివరించేందుకు అంతర్గత ఉపయోగం కోసం ఉద్దేశించిన విద్యాపరమైన ప్రక్రియలో భాగంగా నిర్వహించామన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ టెక్నాలజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కాలేజీ అది.

కోల్ కతాకు 150 కిలోమీటర్ల దూరంలోని నదియా లో హరిఘటా టెక్నాలజీ కాలేజీ లోని సైకాలజీ శాఖ లో వివాహం జరిగింది. ప్రొఫెసర్ , ఆ విద్యార్థిని దండలు మార్చుకోవడంతో పాటు ఓ కొవ్వొత్తి వెలిగించి. దాని చుట్టూ ఏడు అడుగులు వేస్తూన్న దృశ్యం వీడియోలో కన్పించింది. పెళ్లి కొడుకు దుస్తులలో మెడలో పూలదండతో వీడియోలో కన్పించిన ఆ ప్రొఫెసర్ పేరు పాయల్ బెనర్జీ. ఆ అమ్మాయి కూడా ఇది ఉత్తుత్తి పెళ్లి అని దబాయించింది. అయినా ఈ తంతు పై విచారణకు యూనివర్సిటీ అధికారులు ముగ్గురు సభ్యులతో ఎంక్వయిరీ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ అమ్మాయిని సెలవుపై ఇంటికి పంపివేశారు. దర్యాప్తులో నిజా నిజాలు తేలేవరకూ ప్రొఫెసర్ పై ఎలాంటి చర్య తీసుకోబోమని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News