మరోసారి తేల్చి చెప్పిన లగచర్ల
రైతులు జాతీయ మానవ
హక్కుల కమిషన్ బృందం
పర్యటన ఆనాటి ఘటన,
ఫార్మా రైతుల స్థితిగతులపై
ఆరా
మనతెలంగాణ/ కొడంగల్/దౌల్తాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి రాజకీయ పెను ప్రకంపనలకు కారణమైన వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం, ఫార్మా బాధిత గ్రామాలైన లగచర్ల, రోటిబండతండాల్లో శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ ముగ్గురు సభ్యుల బృందం పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫార్మా కంపెనీల కోసం తమ భూములను స్వా ధీనపరుచుకోవాలని చూస్తోందని, ఈ ప్రాంతంలో ఫా ర్మా కంపెనీల ఏర్పాటును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా బలవంతంగా భూసేకరణ పేరుతో తమ గ్రామాలకు వచ్చిన అధికారులపై దాడుల పేరుతో ప్రభుత్వం అక్రమ అరెస్టులను చేస్తోందని విన్నవిస్తూ రైతులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసి న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనపై స్పందించిన కమిషన్ ఘటన పూర్వపరాలను తెలుసుకొని నిజనిర్ధారణ చేసేందుకుగాను ముగ్గురు సభ్యుల బృందాన్ని లగచర్ల గ్రామానికి పంపించింది. ఇందులో భాగంగా గ్రామానికి వచ్చిన త్రిసభ్య కమిటీ సభ్యులైన కమిషన్ డిప్యూటీ రిజిష్ట్రార్ ఆఫ్‌లా ముకేష్, ఇన్‌స్పెక్టర్‌లు రోహిత్‌సింగ్, యతిప్రకాష్‌శర్మ బాధిత గ్రామాల ప్రజలను స్వయంగా కలిసి, సంఘటన రోజు అక్కడ జరిగిన విషయాలను సవివరంగా రైతులను, గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఫార్మా ఏర్పా టు చేస్తున్న విషయం తమకు తెలియదని, బ్యాంకులో లోన్‌ల కోసం వెళ్ళినప్పుడు అధికారులు తమ గ్రామాలలో ప్రభుత్వం ఫార్మా ఏర్పాటు విలేజీ ఏర్పాటు చేస్తుందని, కనుక మీ గ్రామాల వ్యవసాయ భూములకు లోన్ లు ఇవ్వడం కుదరదని చెప్పారని పలువురు రైతులు కమిషన్ సభ్యులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల రైతుల తమ భూములను ఎట్టి పరిస్థితులలో ఫార్మా కంపెనీలకు భూములను ఇవ్వబోమని నినదిస్తూ గత నాలుగు నెలలుగా దుద్యాల మండల కేంద్రంతోపాటు లగచర్లలో నిరవధిక నిరసన, ధర్నా కార్యక్రమాలను నిర్వహించినట్లు రైతులు పేర్కొన్నారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వవలసిందేనంటూ అధికారులు భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ కార్యక్రమం లగచర్ల గ్రామంలో కాకుండా దుద్యాల గ్రామ శివారులో ఏర్పాటు చేశారని రైతులు తెలిపారు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వ డం ఇష్టం లేని రైతులు ఆ సమావేశాన్ని బహిష్కరించి అ క్కడకు వెళ్ళలేదన్నారు. కానీ అధికారులు వారంతటవారే తమకు ఎలాంటి సమాచారం లేకుండగానే నేరుగా గ్రా మంలోకి రావడంతో స్థానిక రైతులంతా అధికారులను గోబ్యాక్ అని నినాదాలతో వెనక్కి వెళ్ళిపోమని హెచ్చరించారని అన్నారు.
కానీ అధికారులు అవేమీ వినిపించుకోకుండా గ్రామంలోకి రావడంతో వారికి రైతులకు మధ్య తోపులాట జరిగిందన్నారు. ఈ క్రమంలో జరిగిన చిన్నపాటి ఘర్షణలో అధికారులపై కొంతమంది రైతులు చే యి చేసుకున్నారని అన్నారు. ఈ ఘటన భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేని రైతులు.. అధికారులు తమ భూములను ఎక్కడ స్వాధీనపరుచుకుంటారో అనే అనుమానంలో భాగంగా అనాలోచితంగా జరిగిన చర్యనే కానీ కావాలని దురుద్దేశంతో చేసిన సంఘటన కాదని వారు కమిషన్ సభ్యులకు తెలిపారు. కానీ సంఘటన జరిగిన రోజు రాత్రి పోలీసులు తమ గ్రామాలకు వచ్చి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. గ్రామంలో, తండాలో ప్రతి ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారని అన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు అని చూడకుండా దా డులు చేశారన్నారు. భయంతో తాము ప్రస్తుతం కోత దశకు వచ్చి చేతి కాడ ఉన్న పంటలను కోసుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నామన్నారు. తమకు ఎక్కడ న్యాయం జరుగుతుందో తెలియని పరిస్థితులలో జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు.
కానీ కొందరు మాత్రం ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముతూ రా జకీయ నాయకుల అండదండలతో జరిగిన దాడిగా చిత్రీకరించడం ఎంతమాత్రం సమంజసం కాదని రైతులు కమిషన్ సభ్యులకు తెలియజేశారు. ప్రా ణం పోయినా ఫార్మా కంపెనీలకు భూములను ఇవ్వబో మని వారు కమిషన్ సభ్యులకు తెగేసి చెప్పారు. భూము లు కోల్పోతే తాము జీవనం కొనసాగించలేమని, అక్రమంగా పోలీసులు అరెస్టు చేసిన తమ యువకులను వెంటనే విడుదల చేయించేలా కమిషన్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కమిషన్ సభ్యుల ఎదుట రైతులు మొరపెట్టుకున్నారు.దాడి ఘటనలో అరెస్టు చేసిన వారికి బెయిల్ రావాలంటే ఇంకా దాడిలో పాల్గొన్న పలువురు పరారీలో ఉ న్నారని, వారంతా కోర్టులో గానీ పోలీసుల సమక్షంలో గానీ లొంగిపోతే అరెస్టు చేసిన వారికి తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని, కనుక మిగ తా వారు ఎక్కడ ఉన్నా వెంటనే లొంగి పోవాలని వారికి సూ చించాలని కొడంగల్ సిఐ శ్రీధర్‌రెడ్డి, బొంరాస్‌పేట్ ఎస్ ఐ రావూఫ్ గ్రామాలలో ఉన్న మహిళలకు సూచించారు. ముందస్తు బెయిల్ తీసుకొని కోర్టులో లొంగిపోవచ్చని అన్నారు. ఒకవేళ న్యాయ పోరాటానికి తగిన ఆర్థిక వనరులు లేకపోతే ప్రభుత్వ ఉచిత న్యాయ విభాగం ఉంటుందని, అక్క డ వారిని సంప్రదించవచ్చని తెలిపారు.