Monday, December 23, 2024

రాజకీయాల్లోకి లగడపాటి రాజగోపాల్ రీఎంట్రీ?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు పనిచేసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల, విజయవాడలో రాజగోపాల్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. త్వరలో విజయవాడలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మయ సమావేశాలు నిర్వహించనున్నారు.

నెలాఖరులో లగడపాటితో సమావేశానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి. విభజన తర్వాత లగడపాటి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అనుచరులు కొరుతున్నారు. త్వరలో విజయవాడలోని అన్ని నియోజక వర్గాల్లో ఆత్మయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లగడపాటి రాజగోపాల్ రాజకీయ భవిష్యత్తు అస్పష్టంగానే ఉంది. రాజకీయ రంగానికి తిరిగి వెళ్లాలా వద్దా అనే దానిపై ఆయన నిర్ణయంపై అతని మద్దతుదారులు, రాజకీయ పరిశీలకులు భారీగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News