Wednesday, January 22, 2025

తెలంగాణ నేపథ్యంలో ‘లగ్గం’

- Advertisement -
- Advertisement -

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-, మాటలు, -స్క్రీన్ ప్లే-, దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే విందు, చిందు, కన్నులవిందుగా చూపించబోతున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ “లగ్గం టీజర్ చాలా బాగుంది, విజువల్స్ అదిరిపోయాయి. డైరెక్టర్ రమేష్ చెప్పాల మంచి టేస్ట్‌తో ఈ సినిమాను తీశారనిపిస్తుంది”అని అన్నారు. డైరెక్టర్ రమేష్ చెప్పాల మాట్లాడుతూ “నిర్మాత వేణు గోపాల్ రెడ్డి ఈ సినిమా కథను నమ్మి నిర్మించారు. కథ, కథనం ఈ సినిమాకు బలం. కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది”అని తెలిపారు. నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫీల్ గుడ్ సాంగ్స్ లగ్గం సినిమాలో ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోహిణి, సాయి రోనక్, బొంతల నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News