Sunday, December 22, 2024

లహరి, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’

- Advertisement -
- Advertisement -

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిలేరియస్ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి నిర్మిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మేమ్ ఫేమస్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తుంది. ఈ మేరకు ఒక ఫన్నీ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. గీతా ఆఫీస్ ముందు సుమంత్ ప్రభాస్ అండ్ టీం.. ‘చిన్నపిల్లలు తింటారు లిటిల్ హార్ట్స్,.. మేమ్ ఫేమస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది గీతా ఆర్ట్స్” అంటే.. ఆఫీసు గేటు తీసి బయటికి వచ్చిన అల్లు అరవింద్ .. ”నేను ఎప్పుడు తీసుకున్నానుర్రా.. ?” అని ప్రశ్నించగా..”కొత్తోళ్ళం సర్.. ఛాయ్ బిస్కెట్” అని టీం సమాధానం చెప్పడం.. దాని అల్లు అరవింద్ హ్యాపీగా ఫీలై.. ’26మే.. డన్.. అందరూ రండి థియేటర్ కి” అని అల్ ది బెస్ట్ చెప్పే వీడియో ఆకట్టుకుంది.

ఇంతకుముందు ‘వర్షం పడుతోంది చమ్ చమ్ చమ్… మే 26న మేమ్ ఫేమస్ కి అందరూ కమ్ కమ్ కమ్ ‘ అంటూ హీరో విజయ్ దేవరకొండ చేసిన డేట్ అనౌన్స్ మెంట్ వీడియో కూడా వైరల్ అయ్యింది. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్. మే 26న మేమ్ ఫేమస్’ విడుదలౌతుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News