Monday, January 20, 2025

పాన్ ఇండియా మూవీ

- Advertisement -
- Advertisement -

Lahiri Films LLP Movie is Pan India Movie

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆడియో సంస్థ ‘లహరి మ్యూజిక్’ చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తోంది. ‘లహరి ఫిలిమ్స్ ఎల్‌ఎల్‌పి’ పేరుతో ‘వీనస్ ఎంటర్‌టైనర్స్’తో కలిసి సినిమాలను నిర్మిస్తున్నట్ల్లు ప్రకటించింది. పాన్- ఇండియా నటుడు, దర్శకుడు అయిన ఉపేంద్ర సహకారంతో ఓ సినిమా రూపొందించనుంది. కన్నడ, హిందీ, తెలుగు, తమిళం భాషలలో గొప్ప కంటెంట్‌తో ఈ పాన్ -ఇండియా చిత్రం ద్వారా మొత్తం భారతీయ ప్రేక్షకులను అలరించడానికి ఫిల్మ్‌మేకర్స్ సిద్ధమవుతున్నారు. బాహుబలి, కెజిఎఫ్, ఇటీవలి విజయం సాధించిన పుష్ప తరహాలోనే ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది త్వరలో సెట్స్‌కి వెళ్లడానికి సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.మనోహరన్ మాట్లాడుతూ “ గత 25 సంవత్సరాలుగా సంగీత ప్రియుల కోసం పనిచేసిన తర్వాత మేము ఈ అసోసియేషన్ కోసం ఎదురుచూశాం. లహరి సంస్థ ఉపేంద్ర తొలి చిత్రం ‘ఎ’ నుండి అతనితో కలిసి పనిచేస్తోంది. ఆ సినిమా దక్షిణాదిలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. 90వ దశకం చివరలో కల్ట్ క్లాసిక్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇప్పుడు భారతదేశం, విదేశాలలో మొత్తం భారతీయ ప్రేక్షకులు అతని సినిమాలను ఆస్వాదించాలని కోరుకుంటున్నాము”అని అన్నారు. నటుడు, దర్శకుడు ఉపేంద్ర మాట్లాడుతూ ఈ పాన్- ఇండియన్ చిత్రానికి పనిచేయడానికి తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News