కొలొంబో: శ్రీలంక క్రికెటర్ లహిరు తిరుమన్నే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫేస్‌బుక్‌లో తన ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేశాడు వరల్డ్ కప్‌స్టార్. మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్ కప్ ఉండటంతో లంక జట్టుకు తిరుమన్నే వీడ్కోలు ప్రకటించడంతో ఆ జట్టుకు తీవ్రమైన లోటని చెప్పవచ్చు. ‘క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం చాలా బాధగా ఉందని, బ్యాటర్‌గా మైదానంలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ జట్టు గెలుపుకోసం ఉత్తమ ప్రదర్శన చేశాను. క్రికెట్ అంటే ఎంతో గౌరవం. అదేవిధంగా లంక తరఫున శాయశక్తులొడ్డి ఆడాను’ అని తిరుమన్నే తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. కానీ, క్రికెట్ నుంచి తప్పుకోవాడానికి గల కారణాలను మాత్రం తెలియజేయలేదు.
2010లో వన్డేల్లోకి ఆరంగేట్రం చేసిన తిరుమన్నే తొలి వన్డే భారత్‌పై ఆడాడు. ట్రై సిరీస్‌లో భాగంగా మిర్పూర్‌లో వేదికగా జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో పర్లేదు అనిపించాడు. అనంతరం 2013లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై మరో వన్డేలో అర్థ సెంచరీతో రాణించాడు. ఇక, 2014లో టి20 వరల్డ్ కప్ శ్రీలంక జట్టులో తిమన్నే కీలక భూమిక పోషించాడు. 13 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో తిరుమన్నే 44 టెస్టులు ఆడి 3 సెంచరీలతో కలిపి 2,088 పరుగులు చేయగా 127 వన్డేల్లో 3,194 పరుగులు చేశాడు. 26 టి20ల్లో 291 పరుగులు సాధించాడు.