మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శక త్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. గురువారం మేకర్స్ సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్ అప్ బీట్ మోడ్రన్ స్టయిల్ బ్లెండ్‌తో ఆకట్టుకుంది. సాంగ్ లాంచింగ్ ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మాట్లాడుతూ “డైరెక్టర్ రామ్ నారాయణ్ కథ చెప్పగానే నేను చేస్తానని చెప్పాను. ఫిబ్రవరి 14న వస్తున్నాం. వాలెంటై న్స్ డే కి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటా రు. ఈ వాలెంటైన్స్ డే కి మీకు లైలా వుంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ వున్నాడు.
నా కెరీర్‌లో యాక్షన్ టచ్‌తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఇదే. న్యూ ఏజ్ ఫిలిం. అందరూ ఎంజాయ్ చేస్తారు”అని అన్నారు. డైరెక్టర్ రామ్ నారాయణ్ మాట్లాడుతూ “ఇలాం టి సబ్జెక్ట్ చేయడం ఒక ఛాలెంజ్. ఇలాంటి సబ్జెక్ట్ ని ఒప్పుకున్నందుకు సాహుకి చాలా థాంక్స్. ఈ కథ ఇద్దరు, ముగ్గురు హీరోలకు చెప్పాను. లేడి గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి వున్నాడే చేయాలి. అలాంటి పిచ్చి వున్న విశ్వక్ నాకు దొరికారు. తనకు లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను”అని తెలియజేశారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ “లేడి క్యారెక్టర్ ని చేయగలుగుతామా లేదా అనుకునే టైంలో విశ్వక్ ఇలాంటి క్యారెక్టర్ కోసం తాను ఎదురుచూస్తున్నాని చెప్పి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది మంచి క్యారెక్టర్‌గా తన కెరీర్‌లో నిలిచిపోతుంది. తప్పకుం డా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ పూర్ణచారి పాల్గొన్నారు.