Friday, January 17, 2025

‘లైలా’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

బోల్డ్, యూనిక్ సబ్జెక్ట్‌లను ఎంచుకునే మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ తన అప్ కమింగ్ మూవీ ’లైలా’లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్‌లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి విలక్షణతను చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ’లైలా’ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మేకర్స్ గతంలో లైలా ఐ లుక్‌ని రిలీజ్ చేయగా విశ్వక్‌సేన్ క్యారెక్టర్ అందరినీ మైమరపించింది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున లైలా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్‌సేన్ స్టైలిష్ అవతార్, స్పోర్టింగ్ ట్రెండీ ఎటైర్, సన్ గ్లాసెస్‌తో కనిపించారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News