Wednesday, January 22, 2025

మైనారిటీలకు లక్ష సాయం

- Advertisement -
- Advertisement -
మైనారిటీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాల అమలు
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడి
మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్లకు సన్మానం

హైదరాబాద్ : రాష్ట్రంలోని మైనారిటీలకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభవార్త వినిపించారు. పేద మైనారిటీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని మంత్రి ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. మైనారిటీలకు ఆర్థిక సాయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మైనారిటీలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

పలు మైనారిటీ కార్పొ రేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారిని మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, సన్మానించారు. జలవిహార్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్‌ఎలు షకీల్, దానం నాగేందర్, ఎంఎల్‌సి ఫరూక్ హుస్సేన్, పలు మైనారిటీ కార్పొరేషన్‌ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సంద్భ్రంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మైనారిటీలను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో గౌరవిస్తారని, రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారని తెలిపారు. హిందువులకు కళ్యాణలక్ష్మి అమ్లు చేసినట్లుగానే మైనారిటీల కోసం షాదీ ముబారక్ అమలు చేస్తున్నారని తెలిపారు. మైనారిటీల కోసం రూ. లక్ష ఆర్థిక సాయం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామ్న్నారు. ఇందుకు సంబంధించిన జీఓ ఒకట్రెండు రోజుల్లో వస్తుందన్నారు. దేశంలో ఇప్పటికీ ముస్లింలు పేదవారిగానే ఉన్నారని ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లే నని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో రూ. 2,200 కోట్ల కేటాయించామన్నారు. ఒక్క సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదని గుర్తు చేశారు.

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియం కూడా అందుబాటులో ఉందని, రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మైనారిటీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఉర్దూ మీడియంలో కూడా నీట్ నిర్వహించాలని అడిగిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరేనని అన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ బిఆర్‌ఎస్ పారీ, ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. సల్వా ఫాతిమా ను పైలట్ అవుతానంటే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ డబులు ఇచ్చి ఫైలట్ చేశారని, ఇప్పుడా అమ్మాయి నెలకు రూ. 5 లక్షలు సంపాదిస్తోందని పేర్కొన్నారు. దేశంలో మైనారిటీ అమ్మాయిలు ఎక్కువగా చదువుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. అమ్మాయిల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నామన్నారు. 20 లక్షలు ఓవర్సిస్ స్కాలర్ షిప్ ఇచ్చి విదేశాల్లో చదివిస్తున్నామని, రంజాన్ కానుకలు, అజ్మీర్ దర్గా లో 5 కోట్లు కేటాయించి ఒక భవనం ర్మిస్తున్నామన్నారు. మైనారిటీ నేతలను ఈ సందర్భంగా సన్మానించినట్లు హోం మంత్రి మహమూద్ అలీ ట్వీట్ చేశారు.

Audience

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News