న్యూస్ డెస్క్: ఈ ప్రపంచంలో.. ముఖ్యంగా భారతదేశంలో అద్భుతాలు, వింతలకు కొదవ లేదు. అనేక చోట్ల మావనవాతీత శక్తులు ఉన్నట్లు.. అద్భుతాలు జరిగినట్లు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి ఒక ప్రదేశమే ఉత్తరాఖండ్‌లో ఉన్న ప్రాచీన శివాలయం. ఇక్కడ జరిగిన ఒక విచిత్ర సంఘటన వింటే మీరూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు.
చనిపోయిన మనిషి మళ్లీ ప్రాణం పోసుకుంటాడు ఈ ఆలయంలో వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నమ్మలేని నిజం అంటారు ఇక్కడి ప్రజలు. చనిపోయిన మనిషిని ఈ గుడిలోకి తీసుకువస్తే ఆ మనిషిలోకి మళ్లీ కొద్దిసేపు బతుకుతాడని స్థానికులు చెబుతారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లఖామండల్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. చుట్టూ గుహలు, పురాతన ఆలయాల శిథిలాల నడుమ ఉండే ఈ ఆలయంలో మహా శివుడు కొలువై ఉన్నాడు. యమునా నది ఒడ్డున బర్నిగడ్ అనే ప్రదేశానికి సమీపంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపినపుడు వివిధ పరిమాణాలలో, రూపాలలో వందలాది శివలింగాలు బయటపడ్డాయి.
ఈ పురాతన ఆలయం ముఖ ద్వారం వద్ద రెండు ద్వర పాలకుల విగ్రహాలు ఉన్నాయి. ఒక విగ్రహానికి సగం విరిగిపోయిన చేయి ఉంటుంది. అది ఎందుకు విరిగిపోయిందో ఎవరికీ తెలియదు. అయితే ఒకసారి.. ఆ ద్వారపాలకుడిఎదుట శవాన్ని ఉంచగా ఆలయ పూజారి ఆ శవంపై నీళ్లు చల్లినపుడు మళ్లీ ప్రాణం పోసుకుని శవం లేచియూర్చుంది.
కొద్దిసేపు లేచి కూర్చున్న ఆ వ్యక్తి గుడిలో కొలువై ఉన్న దేవుడి పేరు చెప్పాడు. పూజారి ఇచ్చిన గంగా జలాన్ని సేవించిన అనంతరం మళ్లీ ప్రాణం కోల్పోయిన స్థితికి చేరుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ అనేకం చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే అలా జరగడం సాధ్యమేనా అంటే..అదే ఈ ఆలయంలో జరిగే అద్భుతమని వారు చెబుతారు.