Wednesday, January 22, 2025

లఖ్‌బీర్ సింగ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

కెనడాకు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇండియా-కెనడా మధ్య హర్థీప్ సింగ్ హత్య కేసు వివాదం కొనసాగుతున్న వేళ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, లఖ్‌బీర్ సింగ్ (33)కు పంజాబ్ శాశ్వత నివాసం ఉందని ఎంహెచ్ఎ తెలిపింది. అతడిని ఉగ్రవాదులతో సంబంధం ఉందని చెప్పింది. లాండా ప్రస్తుతం కెనడాలో ఉంటున్నాడు.
2021లో మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై జరిగిన రాకెట్ దాడిలో లాండా ప్రమేయం ఉందని, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 1989లో పంజాబ్‌లోని తార్న్ తరణ్ జిల్లాలో జన్మించిన లాండా, 2017లో కెనడాకు పారిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News